Manthani: చిన్నారి అభిమానానికి చలించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
Manthani: పెద్దపల్లి జిల్లా గుండారానికి చెందిన చిన్నారి శాన్విక చూపిన అభిమానానికి ముచ్చటపడిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దంపతులు ఆమెను తమ ఇంటికి ఆహ్వానించి సత్కరించారు.
Manthani: చిన్నారి అభిమానానికి చలించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని: చిన్నారి చూపిన అభిమానానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దంపతులు ఆప్యాయతతో స్పందించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన సింగం శ్రీనివాస్–లావణ్య దంపతుల కుమార్తె శాన్వికకు పుట్ట మధూకర్ అంటే ఎంతో అభిమానం.
తరచూ ఆయన పేరును పలుకుతూ తన అభిమానాన్ని వ్యక్తం చేస్తున్న చిన్నారి గురించి స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న పుట్ట మధూకర్, శైలజ దంపతులు మంగళవారం చిన్నారి కుటుంబాన్ని మంథనిలోని తమ నివాసం రాజగృహాకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శాన్వికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి సాదరంగా స్వాగతించారు. కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి పుట్ట మధూకర్, శైలజ దంపతులు స్వయంగా వడ్డించారు. అనంతరం చిన్నారి శాన్వికతో పాటు ఆమె తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు అందజేసి సత్కరించారు.
చిన్నారి చూపిన అభిమానానికి గౌరవం ఇస్తూ ఆమె కుటుంబంతో కొంత సమయం గడిపిన పుట్ట మధూకర్ దంపతుల ఆతిథ్యం అక్కడి వారిని ఆకట్టుకుంది. వయసుతో సంబంధం లేకుండా స్వచ్ఛమైన అభిమానానికి ఆప్యాయతతో స్పందించిన ఈ ఘటన స్థానికంగా ప్రత్యేకంగా నిలిచింది.




