Manthani: కాంగ్రెస్ పార్టీ నుంచి పోరెడ్డి తిరుపతి రెడ్డి సస్పెన్షన్
Manthani: మంథని మండలం నగరంపల్లి ఉప సర్పంచ్ పోరెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని అయిలి ప్రసాద్ హెచ్చరిక.
Manthani: కాంగ్రెస్ పార్టీ నుంచి పోరెడ్డి తిరుపతి రెడ్డి సస్పెన్షన్
మంథని: పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మంథని మండలం నగరంపల్లి గ్రామ ఉప సర్పంచ్ పోరెడ్డి తిరుపతి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై సస్పెన్షన్‌తో పాటు అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరణ వేటు కూడా తప్పదని తెలిపారు. పార్టీ క్రమశిక్షణను కాపాడేందు అధిష్ఠానం నిర్ణయాలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతాయని అయిలి ప్రసాద్ పేర్కొన్నారు.




