Manthani: మంత్రి శ్రీధర్ బాబుపై విమర్శలు చేస్తే ఊరుకోం: కాంగ్రెస్!

Manthani: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై చౌకబారు విమర్శలు చేస్తే సహించేది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను మంథని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.

SHANKAR, MANTHANI
Published on: 3 Nov 2026 5:35 PM IST
Manthani
X

Manthani: మంత్రి శ్రీధర్ బాబుపై విమర్శలు చేస్తే ఊరుకోం: కాంగ్రెస్!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎంపీ గడ్డ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశం పెట్టి స్పందించిన కాంగ్రెస్ నాయకులు. మంత్రి శ్రీధర్ బాబుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్దపల్లి జిల్లా మంథనిలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మంత్రి శ్రీధర్ బాబుకు ఎంపీ వంశీకృష్ణ రాసిన లేఖపై మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు.

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై చౌకబారు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంపీ వంశీకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. మంథనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎంపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయ వేడిని రాజేసింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాసిన లేఖపై జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ ఎంపీ వంశీకృష్ణను హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

మరోవైపు ఎంపీ వంశీకృష్ణ మంథని ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా పర్యటనలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తాను కూర్చున్న చెట్టునే తానే నరుక్కుంటున్న విషయాన్ని ఎంపీ వంశీకృష్ణ గుర్తించాలని హితవు పలికారు. ఎంపీ వంశీకృష్ణ వ్యవహారశైలిపై నేతకాని సంఘం తరఫున రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబుపై ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, పెరవేని లింగయ్య యాదవ్, వేల్పుల రాజు, ఐలి శ్రీనివాస్, ఎల్లంకి వంశీ, బెల్లంకొండ సత్యనారాయణ రెడ్డి, మంథని రాకేష్, ఇందారపు అనిల్, అక్కపాక సంపత్, దొరగొర్ల శ్రీనివాస్ యాదవ్, పెట్టెం రామస్వామి, తిరుమల్, పంచిక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI