Manthani: తాపీ మేస్త్రీలకు ఎన్ఏసీ శిక్షణ పూర్తి.. ధ్రువపత్రాలు అందజేత
Manthani: ఎన్ఏసీ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 16 మంది తాపీ మేస్త్రీలకు కల్వచర్లలో ధ్రువపత్రాలు అందజేసిన జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి.
Manthani: తాపీ మేస్త్రీలకు ఎన్ఏసీ శిక్షణ పూర్తి.. ధ్రువపత్రాలు అందజేత
మంథని: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపీ మేస్త్రీల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆధునిక నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో పలువురు తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి సైతం శిక్షణలో భాగస్వాములయ్యారు.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 16 మంది తాపీ మేస్త్రీలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జారీ చేసిన ధ్రువపత్రాలను శనివారం రామగిరి మండలం కల్వచర్లలోని తన కార్యాలయంలో చిలువేరు స్వామి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో నాణ్యమైన పనులు చేపట్టేందుకు వృత్తి నైపుణ్యం ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఆధునిక నిర్మాణ పద్ధతులు, పనిలో నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. కార్మికుల నైపుణ్యానికి గుర్తింపు లభించడంతో పాటు వారి వృత్తిపరమైన అభివృద్ధికి ఈ ధ్రువపత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ధ్రువపత్రాలు అందుకున్న తాపీ మేస్త్రీలు ఎస్కే షరీఫ్, కుసుమ సురేష్, మామిడి కుమార్, వెంగళ రాములు, బైరి శంకర్, ఇటిక్యాల సుధాకర్, జంగిలి తిరుపతి, తన్నీరు విష్ణువర్ధన్, మామిడి సంతోష్, గాదే సారయ్య, ఊదరి సతీష్, గుడ్డేటి ప్రభాకర్, మామిడి కొమురయ్య, పిల్లలమర్రి సంతోష్, ఏల్లే శంకర్, వల్లెపు శీను ఉన్నారు.




