Thimmapur: లిడ్ క్యాప్ భూములు కాపాడాలి: ఎమ్మెల్యేకు మంద కృష్ణ మాదిగ వినతి!

Thimmapur: లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ సోమవారం వినతిపత్రం ఇచ్చారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 16 Nov 2026 6:01 PM IST
Thimmapur
X

Thimmapur: లిడ్ క్యాప్ భూములు కాపాడాలి: ఎమ్మెల్యేకు మంద కృష్ణ మాదిగ వినతి!

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి క్యాంపు కార్యాలయంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కలిసి వినతి పత్రం అందజేశారు. లిడ్ క్యాప్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం వివరిస్తున్న తీరును ఆయన ఎమ్మెల్యేకు వివరించారు.

మాదిగల కులవృత్తి అభివృద్ధి కోసం లిడ్ క్యాప్ భూమిని వినియోగించాలని ఆయన ఎమ్మెల్యేని కోరారు. లిడ్ క్యాప్ భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని మాదిగ ఎమ్మెల్యేలను కలిసి కోరుతున్నట్లు, వీరంతా బాధ్యతగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విలువైన భూమిని కాపాడాలని కోరడం జరుగుతుందన్నారు.

ముఖ్య మంత్రి కుటుంబానికి వర్తిస్తాదనే మాట రాకుండా చూసుకోవాలన్నారు..

హైద్రాబాద్ రాయదుర్గం లోని అత్యంత విలువైన లిడ్ క్యాప్ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, మాదిగ మంత్రులు, ఎమ్మెల్యే ల పై ఉందని, యూనిటీ మాల్ కి ఇవ్వొద్దని మంద కృష్ణ మాదిగ కోరారు. లిడ్ క్యాప్ అంటే చర్మ వృత్తిపైన ఆధారపడి ఉన్న మాదిగల ఆస్తులు అన్నారు.

ఈ భూములు పరిశ్రమ అభివృద్ధి కోసం, వాటి కుల వృత్తుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కోరారు. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని మాదిగ ప్రజా ప్రతినిధులను కలసి కోరుతునట్లు మంద కృష్ణ మాదిగ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా లిడ్ క్యాప్ భూములను దారాదత్తం చేయవద్దనే మంద కృష్ణ మాదిగ వినతిని తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, యూనిటీ మాల్ కేటాయింపులను రద్దు చేయాలని సీఎం ను కోరుతున్నట్లు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. అపోహలను తొలగించేందుకు, యూనిటీ మాల్ కి కేటాయించిన భూములను రద్దు చేయించే బాధ్యత ప్రభుత్వంలోని మాదిగ ఎమ్మెల్యేలపై ఉన్నదని, రద్దు అయ్యేలా చూస్తామని ఆయన అన్నారు. లిడ్ క్యాప్ పెద్ద సంస్థ అని, 36 లక్షల మాదిగ జనాభా ఉన్న సంస్థ అని, దీనికి చైర్మన్ ను రాబోవు కమిటీలలో నియమించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. 50 కార్పొరేషన్లకు చైర్మన్ ల నియమించినారని, లిడ్ క్యాప్ కు కూడా నియమించాలని సీఎంను కోరనున్నట్లు తెలిపారు. లిడ్ క్యాప్ భూములను సైతం కాపాడే బాధ్యతను ఎమ్మెల్యేలుగా దాము తీసుకుంటామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు.

అనంతరం అలుగునూర్ లోని ఎమ్మార్పీఎస్ నాయకులు సిరిసిల్ల శంకర్ గ్రూహంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి మందకృష్ణ మాదిగ ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బోయిని కొమురయ్య, గోస్కీ శంకర్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేకల సునిల్, కన్నం లక్ష్మణ్, సిరిసిల్ల శంకర్, సముద్రాల లక్ష్మణ్,కొమ్ము సంపత్ , ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU