Illanthakunta: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసానే లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి!
Illanthakunta: ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్లో శుక్రవారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
Illanthakunta: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసానే లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి!
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సర్పంచులు ఈ పథకాన్ని ప్రారంభించారు. రేపాక గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాత మల్లేశం, ఉపసర్పంచ్ మహేష్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, సీఏ అనురాధ, వార్డు సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




