Manakondur: పారదర్శకత కోసమే మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు
Manakondur: ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత కోసమే కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి తెలిపారు.
Manakondur: పారదర్శకత కోసమే మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు
మానకొండూర్: ధాన్యం కొనుగోళ్లలో పూర్తి పారదర్శకతను పాటించడంతో పాటు అక్రమాలకు తావులేకుండా చేసేందుకే కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్కు అడ్డుకట్ట వేసి,రైతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కోతలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాలకు చేరువలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పీఏసీఎస్ పరిధిలోని గ్రామాల్లో కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, నుస్తులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి,సిఇఒ ఆంజనేయులు, సర్పంచ్ గోదారి శోభారాణి,మండల అధ్యక్షులు బండారి రమేష్, సొసైటీ మాజీ చైర్మన్ గోపు మల్లారెడ్డి,మాజీ ఎంపిటిసి కొత్త తిరుపతిరెడ్డి, నాయకులు బుధారపు శ్రీనివాస్,బండారిపల్లి లక్ష్మణ్,
కొమ్మెర మల్లారెడ్డి,తమ్మనవేణి రాములు యాదవ్, మామిడి అనిల్ కుమార్, ఎలుక రాజు, రెడ్డిగాని రాజు, జానీ బాయ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




