Manakondur: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: ఎమ్మెల్యే కవ్వంపల్లి!
Manakondur: మానకొండూర్ మండలం లక్ష్మీపూర్, దేవంపల్లి, పచ్చునూరు గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రారంభించారు.
Manakondur: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: ఎమ్మెల్యే కవ్వంపల్లి!
మానకొండూర్: మానకొండూర్ మండలంలోని లక్ష్మీపూర్, దేవంపల్లి, పచ్చునూరు గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఊటూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో లక్ష్మీపూర్‌లో, దేవంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో దేవంపల్లి, పచ్చునూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.




