Manakondur: మానకొండూర్ వద్ద త్రుటిలో తప్పిన భారీ గ్రానైట్ ప్రమాదం!

Manakondur: మానకొండూర్ చెరువుకట్ట వద్ద ఓవర్‌లోడ్ లారీ నుంచి భారీ గ్రానైట్ రాయి రోడ్డుపై పడింది. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకోగా, 2 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది.

ANJANEYULU, MANAKONDURU
Published on: 27 Oct 2026 7:31 PM IST
Manakondur
X

Manakondur: మానకొండూర్ వద్ద త్రుటిలో తప్పిన భారీ గ్రానైట్ ప్రమాదం!

మానకొండూరు: వరంగల్ వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న ఒక గ్రానైట్ లారీ.. ఓవర్ లోడ్ (పరిమితికి మించి) బండతో వేగంగా ప్రయాణిస్తూ మానకొండూరు చెరువుకట్ట వద్దకు చేరుకుంది. లారీ వేగంగా ఉండటం, లోడ్ ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా అందులోని ఒక భారీ గ్రానైట్ రాయి లారీ నుండి కిందకు జారి కరీంనగర్-మానకొండూరు ప్రధాన రహదారిపై పడిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలేవీ రాకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పినట్లయింది.

ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన రహదారిపై భారీ గ్రానైట్ బండ పడటంతో వరంగల్ - కరీంనగర్ మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న మానకొండూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU