Dharmapuri: ధర్మపురిలో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని చంపిన కుమారుడు!

Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఆస్తి తగాదాలతో క్షణికావేశంలో కన్నతండ్రి మేడిపల్లి వెంకటేశంను కొడుకు లక్ష్మణ్ కర్రతో కొట్టి హత్య చేశాడు.

RAMESH, DHARMPURI
Published on: 1 Nov 2026 8:40 AM IST
Dharmapuri
X

Dharmapuri: ధర్మపురిలో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని చంపిన కుమారుడు!

Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని క్షణికావేశంలో కుమారుడు హత్య చేసిన సంఘటన గ్రామస్తులను కలిచి వేసింది.గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశంను తన కుమారుడు లక్ష్మణ్ తలపై కర్రతో కొట్టగా తండ్రికి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆస్తి విషయంలో తండ్రి కొడుకుకు గొడవలు కాగా క్షణికావేశంలో తన కన్నతండ్రిని తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు కుమారుడు లక్ష్మణ్.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI