Yellareddypet: ప్రేమ పేరుతో యువతిపై వేధింపులు.. నిందితుడు జుబేర్ అరెస్ట్!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న జుబేర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

KALEEM, SIRICILLA
Published on: 28 Oct 2026 10:03 AM IST
Yellareddypet
X

Yellareddypet: ప్రేమ పేరుతో యువతిపై వేధింపులు.. నిందితుడు జుబేర్ అరెస్ట్!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా వెంటాడుతూ, అసభ్యకరంగా ప్రవర్తించిన జుబేర్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ కే. నాగేంద్ర చారి తెలిపారు.

ఎల్లారెడ్డిపేటకు చెందిన జుబేర్ యువతిని వేధిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిపై గతంలో హుజూరాబాద్‌లో పోక్సో కేసు నమోదైందని, ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.

నిందితుడి నేర ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకొని అతనిపై రౌడీ షీట్ తెరవనున్నట్లు డీఎస్పీ కే. నాగేంద్ర చారి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఉద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎవరూ చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించరాదని హెచ్చరించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA