Peddapalli: ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి: టీఆర్ఎస్ నేత సిరివెని స్వప్న

Peddapalli: అక్టోబర్ 30న ఇంద్రవెల్లిలో కవిత నేతృత్వంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ పెద్దపల్లిలో తెలంగాణ రక్షణ సేన పోస్టర్ ఆవిష్కరించింది.

RAJU, PEDDAPALLI
Published on: 27 Oct 2026 8:35 PM IST
Peddapalli
X

Peddapalli: ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి: టీఆర్ఎస్ నేత సిరివెని స్వప్న

Peddapalli: ఆదివాసీ గడ్డ ఇంద్రవెల్లిలో ఈ నెల 30న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ సురేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం లేదని విమర్శించారు. కవిత ప్రతిపాదించిన పాంచజన్య కార్యక్రమం, భూ లక్ష్యం పథకం గురించి ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.

జిల్లా అధ్యక్షురాలు సిరివెని స్వప్న మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం, ఉచిత విద్య, వైద్యం కల్పించడమే పాంచజన్య లక్ష్యమన్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, యువతకు విద్య, ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.

ఈ సమావేశంలో బొంగోని శంకర్ గౌడ్, ఉస్తేమ్ శ్రీనివాస్, కార్ పాకల రమేష్, దాసరి అంజలి తదితరులు పాల్గొన్నారు.ఇంద్రవెల్లి సభ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న టీఆర్ఎస్ నాయకులు

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI