Chandurti: జోగాపూర్‌లో భారీ చోరీ.. నగదు, బంగారు ఆభరణాల అపహరణ!

Chandurti: రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం జోగాపూర్‌లో భారీ చోరీ జరిగింది. రూ.80 వేల నగదు, తులాల కొద్దీ బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించారు.

BABU, VEMULAWADA
Published on: 17 Oct 2026 9:34 AM IST
Chandurti
X

Chandurti: జోగాపూర్‌లో భారీ చోరీ.. నగదు, బంగారు ఆభరణాల అపహరణ!

Chandurti: చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామంలో రాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుడు ముత్యాల సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ. 80 వేల నగదుతో పాటు రెండు తులాల బంగారు నెక్లెస్, మూడు బంగారు చైన్లు, రెండు చేతుల కమ్మలు, రెండు ఉంగరాలు, మూడు జతల వెండి పట్టగొలుసులు, రెండు వెండి మొల్తాడులను ఎత్తుకెళ్లారు.

ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణుల బృందం ఆధారాలను సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA