Karimnagar: చామనపల్లిలో రక్తదాన శిబిరం, హెల్మెట్ అవగాహన సదస్సు

Karimnagar: కరీంనగర్ రూరల్ చామనపల్లిలో మహదేవ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం, హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచ్ దూడం శ్రీనివాస్ హాజరయ్యారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 10 Oct 2026 10:40 PM IST
Karimnagar
X

Karimnagar: చామనపల్లిలో రక్తదాన శిబిరం, హెల్మెట్ అవగాహన సదస్సు

కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామంలో మహదేవ్ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దివంగత మిత్రుడు మరియు ఫౌండేషన్ సభ్యుడు అయిన కీ||శే తాళ్ల శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని చామనపల్లి గ్రామంలో రక్తదాన శిబిరం మరియు హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫౌండేషన్ సభ్యుడు తాళ్ల శివాజీ మిత్రులు అవారి రాజ్ కుమార్, మామిడాల సుమంత్ గ్రామంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్ దూడం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై దివంగత మిత్రుడు తాళ్ల శివాజీ జ్ఞాపకార్థం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం, హెల్మెట్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు

యువత ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు అతివేగానికి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఇవి పోలీసులు జరిమానా విధిస్తారు అనే భయంతో కాకుండా మన ప్రాణాలను మరియు మన కుటుంబాల భవిష్యత్తును కాపాడుకోవడం కోసమేనని అవగాహన కల్పించారు.

అలాగే ఆరోగ్యంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్యుల సూచనలు, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సాధారణంగా మూడు నెలల వ్యవధిలో రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.

మిత్రుడి జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగిస్తూ సమాజంలో రక్తదానం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మహాదేవ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు అవారి రాజుకుమార్ కార్యదర్శి మామిడాల సుమంత్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహదేవ్ సేవా ఫౌండేషన్ సభ్యులు, కీ||శే తాళ్ల శివాజీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులు, చామనపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక అతిథులు సామాజిక కార్యకర్తలు కోట శ్యామ్‌కుమార్, బెల్లపు కరుణాకర్, ఆర్‌ఎస్‌ఐ గణేష్, కోట శివకుమార్, (చేతన సంస్థ జగిత్యాల) మరియు డాక్టర్ ఉషారాణి తదితరులు హాజరయ్యారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN