Peddapalli: లారీ అడ్డంగా పడటంతో కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు!
Peddapalli: పెద్దపల్లి మండలం అందుగులపల్లి సమీపంలో అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొనడంతో క్యాబిన్ నుజ్జునుజ్జయి, కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Peddapalli: లారీ అడ్డంగా పడటంతో కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు!
Peddapalli: పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామ సమీపంలో అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని వైపు వెళ్తున్న రెండు లారీలు వెనుక భాగంలో ఢీకొనడంతో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.
లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




