Karimnagar: గాంధీజీ స్ఫూర్తితో ముందుకు సాగుదాం: కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: కరీంనగర్ గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ చిత్రా మిశ్రా పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Oct 2026 7:07 PM IST
Karimnagar
X

Karimnagar: గాంధీజీ స్ఫూర్తితో ముందుకు సాగుదాం: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్: శాంతి, అహింస మార్గాలను ఆయుధాలుగా చేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చౌరస్తా సమీపంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం.. ఆయన చూపిన బాటలో అందరం నడుద్దామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, నగర పాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN