Sircilla: భూ సమస్యల పరిష్కారానికి పక్కా కార్యాచరణ: జిల్లా కలెక్టర్!

Sircilla: రాజన్న సిరిసిల్లలో భూ సమస్యలపై కమిటీ సభ్యుడు సందీప్ కుమార్ ఝా ఐఏఎస్ సమీక్ష జీవో 134 ప్రకారం తహసీల్దార్లతో సమావేశం, కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమక్షంలో కీలక ఆదేశాలు.

KALEEM, SIRICILLA
Published on: 29 Sept 2026 9:40 PM IST
Sircilla
X

Sircilla: భూ సమస్యల పరిష్కారానికి పక్కా కార్యాచరణ: జిల్లా కలెక్టర్!

సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భూముల అవకతవకలపై నియమించిన కమిటీ సభ్యుడు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూములకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.

జీవో నంబర్ 134 ప్రకారం భూములపై నియమించిన కమిటీ సభ్యుడు సందీప్ కుమార్ ఝా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో భూములకు సంబంధించిన అంశాలు, అవకతవకలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. భూముల వ్యవహారాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భూముల అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA