Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!

Karimnagar: కరీంనగర్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) 29వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. నాయకులు జెండా ఆవిష్కరించి డిమాండ్లు వినిపించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Oct 2026 7:30 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!

Karimnagar: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) 29వ ఆవిర్భావ దినోత్సవం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో ఘనంగా జరిగింది. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన, ఆశయాల జెండాను కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కండె రాజు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2 న ఏర్పడిన కెవిపిఎస్ దళిత, గిరిజన, బలహీన, వర్గాలపై కొనసాగుతున్న అంటరానితనం, కుల వివక్ష పై రాజీలేని పోరాటాలు కొనసాగించిందని అన్నారు.

దళితుల సామాజిక, ఆర్థిక, సమానత్వం, కోసం కేవీపీఎస్ నిర్విరామమైన పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. దళిత, బడుగు, పీడిత వర్గాల ఐక్యతకై కేవీపీఎస్ పని చేస్తుందని ఉపాధి ఉద్యోగం సంక్షేమ పథకాలు అమలుకై రాజీలేని పోరాటాలను కొనసాగిస్తుందని అన్నారు. కెవిపిఎస్ ఏర్పడిన ఆనాతి కాలంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని, జస్టిస్ పున్నయ్య కమిషన్, స్మశాన స్థలలా జీవో ఉచిత కరెంటు కులంతార వివాహాలకు ప్రోత్సాహకం వంటి అనేకమైన హక్కులను సాధించిందని అన్నారు.

ఎస్సీ ఎస్టీ కమిషన్ కోసం, ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం కెవిపిఎస్ నడిపిన పోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా గొప్ప విజయాన్ని సాధించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17శాతం ఉన్న దళితులు నూటికి 80శాతం మంది వ్యవసాయ కార్మికులు పేద రైతులు కౌలు రైతులు ఇతర కార్మికులు గా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు భూమి కేవలం రెండు శాతం మాత్రమే ఉందని దళితుల జనాభా ప్రకారం 17శాతం భూమి కలిగి ఉండాలని అన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఆక్రమించుకున్న వేల ఎకరాల భూములను ఫామ్ హౌజ్ లను తిరిగి ప్రభుత్వం తీసుకొని భూమిలేని దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రైవేట్ పరిశ్రమల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి దళిత కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీలు అసైన్ భూములను తిరిగి పునరుద్ధరించాలని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు రుణాలు పంపిణీ చేయాలని విద్యా జ్యోతుల పథకం కింద పదోతరగతి పాసైన విద్యార్థులకు పదివేల రూపాయలు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 1500 రూపాయలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చదువుకునే ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించాలని ప్రతి మండలానికి ఒక గురుకుల విద్యాలయం ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి దాసరి కనకేష్, పులుపాక సాయికుమార్ జిల్లా నాయకులు పి. నవీన్, శ్రీకాంత్, సంకీర్త్, గోవర్ధన్, ప్రణీత్, అనిల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయి కంటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, బి ఎస్ ఎస్ జిల్లా నాయకుడు శ్రీధర్ పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN