Thimmapur: ఘనంగా కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
Thimmapur: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తిమ్మాపూర్లో ఘనంగా జరిగాయి. కేటీఆర్, గంగుల ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు.
Thimmapur: ఘనంగా కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ పార్టీ రాష్ర్ట నాయకులు, కరీంనగర్ కేడీసీసీబీ మాజీ డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను తిమ్మాపూర్ మండలంలో ఈరోజు నాయకులు , అభిమానులు ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆయనకు ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు.
సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ చైర్మన్, కరీంనగర్ మాజీ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్, అల్గునూర్ 8వ డివిజన్ కార్పోరేటర్ కాల్వ మల్లేశం తోపాటు పార్టీ
నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి షాలువాతో సన్మానించారు. మండలంలోని మహాత్మనగర్ , అల్గునూర్ , తిమ్మాపూర్ ఆయన స్వగృహంలో తన అభిమానుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అంతకుముందు తాపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వృద్దులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో మండల అధ్యక్షులు రావుల రమేష్, గంప వెంకన్న, రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకనందం, సర్పంచులు తాట్ల తిరుపతి, అవుదుర్తి రాంకిషన్, గాండ్ల శ్రీనివాస్, దుర్గం శ్రీనివాస్, సింగిరెడ్డి స్వామిరెడ్డి, నాయిని వెంకట్ రెడ్డి,పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, ఎడ్ల బుచ్చిరెడ్డి, మాతంగి లక్ష్మన్, మడుపు శ్రీనివాస్ రెడ్డి,మాతంగి అంజయ్య, కరివేద జనార్దన్ రెడ్డి ,ఉప సర్పంచ్ లు పొలం మల్లేష్ యాదవ్, మేకల మహేష్,ప్రణీత్ రెడ్డి, గంగిపెల్లి సంపత్, పొతరాజు దేవేందర్, మాదన రాజేందర్, గడ్డి రమేష్, మాశెట్టి శివకృష్ణ,గాజ సాగర్, బోర్ర రవీందర్, నగునూరి వంశీ బిఅర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




