Metpally: మెట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో నూతన తరగతి గదుల ప్రారంభం!

Metpally: మెట్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 77 లక్షల రూపాయలతో నిర్మించిన నాలుగు నూతన తరగతి గదులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 21 Nov 2026 10:54 AM IST
Metpally
X

Metpally: మెట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో నూతన తరగతి గదుల ప్రారంభం!

Metpally: మెట్టుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 77 లక్షల రూపాయల వ్యయంతో నాలుగు నూతన తరగతి గదులను నిర్మించారు. ఇందులో రాజ్యసభ సభ్యులు దామోదరరావు నిధుల నుండి 40 లక్షల రూపాయలు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి 37 లక్షల రూపాయలను కేటాయించారు.

​ఈ నూతన భవన సముదాయాన్ని కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యులు దామోదరరావుకు, జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA