Korutla: కోరుట్లలో పోలీస్ స్టేషన్ సందర్శించిన హ్యాపీ స్కూల్ చిన్నారులు

Korutla: కోరుట్ల హ్యాపీ స్కూల్ చిన్నారుల పోలీస్ స్టేషన్ విద్యా సందర్శన; సమాజ సేవకుల పాఠ్యాంశంలో భాగంగా గ్రీటింగ్ కార్డులు అందజేసిన విద్యార్థులు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 21 Nov 2026 5:19 PM IST
Korutla
X

Korutla: కోరుట్లలో పోలీస్ స్టేషన్ సందర్శించిన హ్యాపీ స్కూల్ చిన్నారులు

కోరుట్ల: కోరుట్లలోని హ్యాపీ స్కూల్ లో "సమాజు సేవకులు" [Community Helpers అనే పాఠ్యాంశంలో భాగంగా చిన్నారులు స్థానిక పోలీస్ స్టేషన్ను విద్యా సందర్శనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు పోలీసులతో మాట్లాడి, వారి విధుల గురించి ఆసక్తిగా ప్రశ్నలు అడిగారు.

ప్రజల భద్రత కోసం పోలీసులు చేసే పనులను, ఆపదలో ఉన్న వారికి వారు ఎలా సహాయం అందిస్తారో పోలీసు సిబ్బంది పిల్లలకు సరళంగా వివరించారు. చిన్నారుల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

ప్రజల భద్రత కోసం 24/7 పనిచేస్తూ, అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న పోలీసులకు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమతో గ్రీటింగ్కార్డులు అందించి, "మాకు, మన సమాజానికి మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు” అని చెప్పారు.

చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సందేహాలను తీర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి హాపీ స్కూల్ ప్రిన్సిపాల్ రాసబక్తుల. సంతోష్ కుమార్ మరియు ఛైర్మన్ జుక్కం తాజ్ ధన్యవాదాలు తెలిపారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA