Peddapalli: పెద్దపల్లి జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి కొప్పుల!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరిగిందని, రైతులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శ.
Peddapalli: పెద్దపల్లి జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి కొప్పుల!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి పెద్దపల్లికి జిల్లా హోదా దక్కిందని అన్నారు. పరిపాలన ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే 33 జిల్లాలను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లా ఏర్పాటు తర్వాతనే మెడికల్ కాలేజీ, సమీకృత కలెక్టరేట్ భవనం వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు.
ఎల్-నినో ప్రభావం వల్ల రైతులు పంటలు వేసుకోవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా స్పందించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే రైతులను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ హయాంలో ఎల్-నినో, లా-నినాలతో సంబంధం లేకుండా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు అందించి అండగా నిలిచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మంత్రి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుగంటి చందర్, నాయకులు చిరుమల్ల రాకేష్, రఘువీర్ సింగ్, దాసరి మమతా రెడ్డి, జెడ్పీటీసీ గంట రాములు, దాసరి ఉష తదితరులు పాల్గొన్నారు.




