Vemulawada: కొండగట్టు అంజన్నకు వేములవాడ రాజన్న దేవస్థానం పట్టువస్త్రాలు

Vemulawada: 60 ఏళ్లకోసారి జరిగే చందనోత్సవం, నిజరూప దర్శనం సందర్భంగా కొండగట్టు అంజన్నకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ.

BABU, VEMULAWADA
Published on: 28 Nov 2026 4:04 PM IST
Vemulawada
X

Vemulawada: కొండగట్టు అంజన్నకు వేములవాడ రాజన్న దేవస్థానం పట్టువస్త్రాలు

వేములవాడ: 60 సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన 'చందనోత్సవం (చందనం తొలగింపు) - మహా సంప్రోక్షణ' మహోత్సవం మరియు నిజరూప దర్శనం సందర్భంగా, జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి (కొండగట్టు) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరఫున శనివారం ఘనంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు గారి ఆదేశాల మేరకు, తెలంగాణలోని ప్రముఖ ఆలయాల నుండి మంగళవారం మరియు శనివారం రోజులలో కొండగట్టు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని సూచించారు. ఇందులో భాగంగా వేములవాడ ఆలయ ఈవో (EO) శ్రీమతి ఎల్. రమాదేవి గారు కుటుంబ సమేతంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు.

దర్శనానంతరం ఆలయ మండపంలో కొండగట్టు అర్చకులు, వేద పండితులు వేములవాడ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారికి స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు. అదేవిధంగా వేములవాడ నుండి విచ్చేసిన ఆలయ అర్చకులు, వేద పండితులు కొండగట్టు ఆలయ ఈవో శ్రీ అంజనా రెడ్డి గారికి రాజన్న స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు:

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆలయ , పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఓన్నారం భాస్కర్,పీఆర్వో పెరుక శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. కొండగట్టు ఆలయం తరఫున ఏఈవో (AEO) హరినాథ్, పర్యవేక్షకులు సునీల్, సీనియర్ అసిస్టెంట్ అశోక్, ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA