Kondagattu: 60 ఏళ్ల తర్వాత అంజన్న నిజరూప దర్శనం ఆనందంగా ఉంది
Kondagattu: కొండగట్టు అంజన్న, బేతాళ స్వామిని దర్శించుకున్న విప్ ఆది శ్రీనివాస్; 60 ఏళ్ల తర్వాత నిజరూప దర్శనం కల్పించడంపై హర్షం, ఆలయ అభివృద్ధిపై వెల్లడి.
Kondagattu: 60 ఏళ్ల తర్వాత అంజన్న నిజరూప దర్శనం ఆనందంగా ఉంది
కొండగట్టు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న ఆలయంతో పాటు బేతాళ స్వామి ఆలయంలోనూ ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అర్చకులు, అధికారుల సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతిలో భక్తులకు అంజన్న నిజరూప దర్శనం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, త్వరలోనే కొండగట్టు క్షేత్రాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని, సీఎం రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరూ ఈ అరుదైన నిజరూప దర్శన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.




