Karimnagar: కరీంనగర్ ప్రజలకు డంపింగ్ యార్డు, ఆర్ఓబీ సమస్యలు శాపం!
Karimnagar: కరీంనగర్లో డంపింగ్ యార్డు, ఆర్ఓబీ సమస్యలు ప్రజలకు శాపంగా మారాయన్న మాజీ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు.
Karimnagar: కరీంనగర్ ప్రజలకు డంపింగ్ యార్డు, ఆర్ఓబీ సమస్యలు శాపం!
Karimnagar: కరీంనగర్ నగరంలో డంపింగ్ యార్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) సమస్యలు ప్రజలకు శాపంగా మారాయని మాజీ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను వృథా చేసి శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. నేడు అధికారంలో ఉన్న బీజేపీ పాలకవర్గం కూడా డంప్యాడ్ సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
స్మార్ట్ సిటీ నిధులతో సమస్యను తొలగించే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా డీపీఆర్లు పూర్తిచేసి, రోజుకు 2వేల టన్నుల బయో మైనింగ్ జరిగేలా చూడాలన్నారు. డంపింగ్ యార్డులో పొగ, మంటలను అరికట్టేందుకు తక్షణమే నాలుగు బోర్లు వేసి వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఓబీ అనుమతులపై కేంద్ర ప్రభుత్వం వద్ద బీజేపీ నేతలు ఒత్తిడి తేలేకపోతున్నారని, ఈ రెండింటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాడతామని స్పష్టం చేశారు.




