Karimnagar: భారత్ సమ్మిట్ దేశ అభివృద్ధికి దోహదపడుతుంది!
Karimnagar: హైదరాబాద్లో జరుగుతున్న భారత్ సమ్మిట్ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
Karimnagar: భారత్ సమ్మిట్ దేశ అభివృద్ధికి దోహదపడుతుంది!
Karimnagar: హైదరాబాదులో జరుగుతున్న భారత సమ్మిట్ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రపంచ దేశాల మేధావులు ఈ సమ్మిట్ లో పాల్గొంటే బిజెపి నాయకులకు కళ్ళు బైర్లు కమ్మి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కేవలం ప్రజలను దృష్టి మతాలు ఎందుకే ధర్నాలు నల్ల జెండాలతో నిరసన తెలపడం సిగ్గుచేయటం అన్నారు. వందల కోట్ల స్కామ్ చేసిన బిజెపి భారత్ సమ్మేట్ గురించి మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు.
దేశ సంపదను ఆదానీ అంబానీలకు దోచిపెడుతూ నీతులు చెప్పడం సరికాదని అన్నారు. మంచి వాతావరణంలో భారత సమ్మె కార్యక్రమం నిర్వహిస్తుంటే ఓర్చుకోలేక పోతున్నారన్నారు.
జై భారత్ మాత అనడం వారి హక్కు అయినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు, భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు జై భారత్ మాత అనే నినాదించింది కాంగ్రెస్ అన్నారు. స్వతంత్రం వచ్చినాక 30 ఏళ్లకు పుట్టిన పార్టీ బిజెపి అని వారికి భారత్ మాత హక్కులు ఏ విధంగా సంక్రమించాయో తెలపాలన్నారు.
రాబోవు రోజుల్లో బిజెపి చేస్తున్న అరాచకాలను ప్రజలలోకి తీసుకెళ్లి, ప్రజా పాలన పై అవగాహన కల్పిస్తామన్నారు. నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలలో మమేకమై కాంగ్రెస్ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పనిచేయాలన్నారు.
భారత సబ్మిట్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మధ్యలో వెళ్లిపోయాడని బండి సంజయ్ అనడం కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లేనన్నారు. భారత్ సమ్మెకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాతే ఫ్లైట్కు టైం అవుతుందని వెళ్లిపోయారని దీన్ని రాజకీయం చేయాలని చూడడం సిగ్గుచేటు అన్నారు.
ఆదానే అంబానీ సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కొని వెళ్లే రకం కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మంచి కార్యక్రమం జరుగుతుంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇకనుండి అయినా బిజెపి నాయకులు నిజాలను ఒప్పుకొని నిజాలు మాట్లాడే పద్ధతిని అలవాటు చేసుకోవాలని సూచించారు.




