Karimnagar: సావునోట్లో తలబెట్టి కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించారు: కేటీఆర్!

Karimnagar: కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన దీక్షా దివస్ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 29 Nov 2026 8:55 PM IST
Karimnagar
X

Karimnagar: సావునోట్లో తలబెట్టి కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించారు: కేటీఆర్!

కరీంనగర్ జిల్లా: సావునోట్లో తలబెట్టి ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించుండనీ, ఉద్యమ పోరాటం అల్గునుర్ నుండే ప్రారంభం అయిందని బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

ఆదివారం సాయంత్రం అలుగునూర్లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి హాజరై వేలాదిగా వచ్చిన కార్యకర్తలు జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ నిరాహార దీక్ష వల్ల తెలంగాణ వచ్చిందనీ ఐదు దశాబ్ధాల కల నెరవేరిందన్నారు. తనను నమ్మిన వారి కల కోసం పోరాడిన గొప్ప యోధుడు కేసీఆర్ అన్నారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు మాట్లాడుతుండుతున్నారని అన్నారు.

యాచించలేదు..

యాచించి కాదు.. పోరాడి రాష్ట్రం తెచ్చాడనీ పేర్కొన్నారు. తెలంగాణ రక్తంలో పోరాటం ఉంది కదా.. అలాంటి తెలంగాణను సాధించేందుకు 60 ఏళ్ళు ఎందుకు పట్టిందనీ అడిగారు. ప్రజలు పోరాట యోధులనీ.. నాయకులే బానిసలన్నారు. 14ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ సాధించి చూపించాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో రథం నడిపింది కేసీఆర్.. యుద్ధం చేసింది కేసీఆర్..అని గుర్తు చేశారు. తెలంగాణ కథలో హీరో కేసీఆర్, విలన్ కాంగ్రెస్ పార్టీ అని.. సంపినోడే సంతాప సభలు పెట్టినట్టు.. నేటి రేవంత్ పరిస్థితి అలా ఉందనీ ఎద్దేవ చేశారు.

కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమైందనీ మన జీవనాడి కాళేశ్వరం మీద దాడి జరుగుతోందన్నారు. తెలంగాణ రాకముందు మానేరులో రక్తం పారిందనీ అన్నమో రామచంద్ర అని అన్న తెలంగాణ.. నేడు దేశానికి అన్నం పెట్టే భాండాగారంగా మారిందన్నారు.

సామాన్య రైతు ఆడుతున్నడు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు చేయరాదా అని అడుగుతుండు.

కేసీఆర్ మీద కోపంతో నేడు తెలంగాణ నీళ్ళన్నీ ఆంధ్రోళ్లకు రేవంత్ రెడ్డి అడుగుతున్నడు.

కొత్త ప్రభుత్వం మూడేళ్లుగా ఓపికతో చూస్తున్నడు. ఏమైనా చేస్తదా అని.

నాలుగు ఓట్ల కోసమో.. నాలుగు సీట్ల కోసమో పెట్టిన పథకాలు కావు కేసీఆర్ పెట్టిండు.

4వేల పింఛన్లు, తులం బంగారం, రైతు బంధు, రుణమాఫీ అంటూ అడ్డగోలుగా హామీలిచ్చి తెలంగాణను మోసం చేసిండనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యువత గర్జించి, గల్లా పట్టే రోజు మళ్లీ వచ్చిందన్నారు.

అటు దేశానికి.. ఇటు రాష్ట్రానికి పట్టిన చీడ కాంగ్రెస్ పార్టీ అని..

కాంగ్రెస్ ఒక్కటే కాదు.. బీజేపీ కూడా దిక్కుమాలిన పార్టీ అన్నారు.

తెలంగాణ ఇచ్చినప్పుడు మోడీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండనీ..

లోక్సభలో ఒక్క తెలంగాణ గొంతు లేదు. ఒకటి సంచులు మోసే నాయకుడు.. మరొకరు చెప్పులు మోసే నాయకుడు తెలంగాణ కోసం ఏం చేసిండ్రన్నారు.

మన కవులు, కళాకారుల మీద విషం చిమ్ముతున్నరు కాంగ్రెస్ నాయకులు.. కవులు, కళాకారులు, మన రసమయి లాంటి మరోసారి గొంతు ఎత్తాల్సిన టైం వచ్చిందన్నారు.

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవనానికి పంపిద్దామనీ.. కాంగ్రెస్ కు ఇంకో 500 రోజులు మిగిలి ఉందన్నారు.

పోలీసులు డ్యూటీ చేయాలని గులాంగిరి మానాలని హెచ్చరించారు. ప్రజలు సుదర్శన చక్రంతో సిద్ధంగా ఉన్నారనీ అన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU