Karimnagar: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మణికంఠ రెడ్డి ఎన్నిక

Karimnagar: హన్మకొండలో జరిగిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ సభల్లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Oct 2026 8:11 PM IST
Karimnagar
X

Karimnagar: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మణికంఠ రెడ్డి ఎన్నిక

కరీంనగర్: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి కరీంనగర్ నగరానికి చెందిన కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఎన్నికయ్యారు.

2011 లో ఏఐఎస్ఎఫ్ లో చేరిన మణికంఠ రెడ్డి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా,నగర కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శిగా పని చేసి 2022లో కొత్తగూడెంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ 3 రాష్ట్ర మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై, తిరిగి సెప్టెంబర్ 28నుండి 30 వ తేదీ వరకు హన్మకొండ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఎన్నికయ్యారు.

విద్యారంగంలో ఉన్న సమస్యలపై,విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించడంలో మణికంఠ రెడ్డి ముందుంటున్నారని జాతీయ,రాష్ట్ర నాయకత్వం గుర్తించి తిరిగి మరోసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి నూనావత్ శ్రీనివాస్ నాయక్,మచ్చ రమేష్, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై అవిశ్రాంతంగా అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ, విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని,మరింత బాధ్యతతో ఉద్యమాలు నిర్వహిస్తానని,విద్యార్థులను,యువతను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటూ విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోని మతోన్మాద పార్టీలను తరిమికొడతామని మణికంఠ రెడ్డి తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN