Vemulawada: నేటి నుండి ప్రారంభం కానున్న కార్తీకమాసం!

Vemulawada: భక్తులకు అత్యంత పవిత్రమైన కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభమైంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

BABU, VEMULAWADA
Published on: 10 Nov 2026 11:50 AM IST
Vemulawada
X

Vemulawada: నేటి నుండి ప్రారంభం కానున్న కార్తీకమాసం!

Vemulawada: వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం దీపావళి పండుగతో అశ్యయుజ మాసం ముగియనుండగా నేటి నుండి నుంచి భక్తులకు ఎంతో ప్రాధాన్యమైన కార్తీక మాసం ప్రారంభం కానుంది, మాఘ మాసంలో ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాను డు, శ్రావణ మాసం లో శ్రీలక్ష్మిదేవి, ఆశ్వయుజ మాసం లో దుర్గాదేవి, కార్తీకమాసంలో శివుడు, మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు.

దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. అనంతరం కార్తీక మాసం ప్రారంభమ వుతుంది,2026, నవంబర్ 10వ తేదీ అనగా.. మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. డిసెంబర్ 8వ తేదీ మంగళవారంతో ఈ మాసం ముగియ నుంది.ఈ మాసం లో పండుగలు అధికంగా ఉంటాయి.

కార్తీకమాస పండగల వివరాలు

నవంబర్ 13 : నాగుల చవితి

నవంబర్ 14: నాగ పంచమి

నవంబర్ 16: మొదటి కార్తీక సోమవారం.

నవంబర్ 21: క్షీరాబ్ది ద్వాదశి

నవంబర్ 23: రెండో కార్తీక సోమవారం

నవంబర్ 24: కార్తీక పౌర్ణమి

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA