Karimnagar: కరీంనగర్ టీటీడీ కళ్యాణమండపంలో ఘనంగా కార్తీక దీపోత్సవ వేడుకలు!

Karimnagar: కరీంనగర్ టీటీడీ కళ్యాణమండపంలో ఆదివారం కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. పురాణం మహేశ్వర శర్మ ప్రత్యేక పూజలు చేయగా మహిళలు భారీగా పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Nov 2026 8:39 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ టీటీడీ కళ్యాణమండపంలో ఘనంగా కార్తీక దీపోత్సవ వేడుకలు!

కరీంనగర్: కరీంనగర్లో ఘనంగా కార్తీక దీపోత్సవ వేడుకలను నిర్వహించారు. నగరంలోని టీటీడీ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్తిక దీపోత్సవానికి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి కార్తిక దీపోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవ వ్యవస్థాపక అధ్యక్షులు సుగుణాకర రావు మాట్లాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు కాపాడాలని, మన సంస్కృతి ఎంతో పురాతనమైనది గొప్పదని అన్నారు. కార్తీక మాసంలో శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసమని అలాంటి ఈ మాసములో శివుడికి విష్ణువుకి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ.

ఈ మాసంలో ఎవరికి పూజ చేసినా ఇద్దరికీ చేసినట్లుగానే పూజ ఫలితాలు ఉంటాయని వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ అన్నారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడంతో ఎంతో పుణ్యం లభిస్తుందని తెలిపారు. ఈ మాసంలో చేసే ప్రతి పూజ విశేష ఫలితాలను ఇస్తుందని అందుకే ఈ మాసానికి అంత ప్రత్యేకత ఉందని చెప్పారు.

కార్తీక దీపోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి మహిళకు దీపం వెలిగించే అవకాశం తో పాడే,.,టు దీపం వెలిగించడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు కార్తిక దీపోత్సవ వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు సుగుణాకర్ రావు దంపతులు, వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ, గంప జగన్, దుర్గ మారుతి, రాచమల్ల కిరణ్, తాడూరి బ్రహ్మం, మల్లేశం, పిట్ల స్వామి, కామారపు నరహరి, గురుపాటి జితేందర్ రెడ్డి, భోగ శ్రీనివాస్, భజన మండలి సభ్యులు, శ్రీవారి ట్రస్ట్ సభ్యురాలు భాగ్య, రాధాకృష్ణ నృత్య బృందం, మహిళలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN