Karimnagar: రైతుల ధాన్యంపై కన్నేసిన దొంగలు.. నలుగురు అరెస్ట్!
Karimnagar: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో రాత్రివేళల్లో రైతుల వరి ధాన్యం బస్తాలను కారులో ఎత్తుకెళ్తున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి 37 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు.
Karimnagar: రైతుల ధాన్యంపై కన్నేసిన దొంగలు.. నలుగురు అరెస్ట్!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్, జగ్గయ్యపల్లి, వల్లంపూర్ గ్రామాల పరిధిలో రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యాన్ని రాత్రి సమయంలో కారులో వచ్చి బస్తాలుగా ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో బేతిగల్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుల వద్ద నుంచి 37 వరి ధాన్యం బస్తాలు, ఒక కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.3 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ. రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటను దొంగిలించడం నేరమని, రైతుల ధాన్యాన్ని దొంగిలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




