Karimnagar: శాతవాహన వర్సిటీలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు విజ్ఞప్తి

Karimnagar: శాతవాహన వర్సిటీలో నూతన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వీసీ ఉమేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపత్రం సమర్పించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 Sept 2026 8:44 PM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన వర్సిటీలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు విజ్ఞప్తి

కరీంనగర్: కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాతవాహన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ విశ్వవిద్యాలయంలో నూతన పరిశోధనా కేంద్రాన్నిఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి వినతిపత్రం సమర్పించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును, ఉన్నత విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని శాతవాహన విశ్వవిద్యాలయంలో అధునాతన రీసెర్చ్ సెంటర్‌తో పాటు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు . విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో పరిశోధనా వసతులు మెరుగుపడితే స్థానిక విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. శాతవాహన విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వీసీ తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR