Timmapur: రేణిగుంట టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ వేగవంతమైన రాకపోకలు

Timmapur: రేణిగుంట రాజీవ్ రహదారి టోల్ ప్లాజా వద్ద పండుగ రద్దీ. ఫాస్ట్‌ట్యాగ్ యాంటెన్నా ఏర్పాటుతో వాహనాలు వేగంగా దాటేలా అధికారుల ప్రత్యేక చర్యలు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 17 Oct 2026 8:43 PM IST
Timmapur
X

Timmapur: రేణిగుంట టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ వేగవంతమైన రాకపోకలు

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట రాజీవ్ రహదారి పై టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా హైదరాబాదు నుండి కరీంనగర్ వైపు వాహనాల పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నాయి.

రాకపోకల ఎక్కువగా ఉండడంతో గత రెండు రోజుల నుండి టోల్ ప్లాజా వద్ద వాహనాలు త్వరగా వెళ్ళేందుకు ఏర్పాటు చేశారు. స్కానర్ కాకుండా పాస్టాగ్ యాంటీనా ఏర్పాటు చేయడంతో వాహనాలు వేగంగా ప్లాజా దాటుతున్నాయి. దీంతో వాహనాలు జామ్ కాకుండా వెళ్తున్నాయి. పండగ పూర్తి వరకు యాంటీనా ను ఉపయోగిస్తామని ప్లాజా సిబ్బంది తెలిపారు.

టోల్ ప్లాజా అధికారులు సిబ్బంది వెంట వెంటనే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాల పండుగ వాతావరణం నెలకొంది.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU