Karimnagar: ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు వెల్లడించిన సీపీ గౌష్ ఆలం!
Karimnagar: కరీంనగర్ పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో భారీ వాహనాలపై నిషేధం.
Karimnagar: ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు వెల్లడించిన సీపీ గౌష్ ఆలం!
Karimnagar: గణేష్ నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్లను ఉపయోగించుకొని సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు.
కరీంనగర్ పట్టణంలో ప్రధానంగా చింతకుంట, కొత్తపల్లి, మానకొండూరు ప్రాంతాల్లో విగ్రహాల నిమజ్జనం ఉంటుంది కాబట్టి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడద్దని ట్రాఫిక్ డ్రైవర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నగరంలోని ట్రాఫిక్ డైవర్షన్లు..
జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వచ్చే వాహనాలు వెలిచాల క్రాస్ రోడ్ నుంచి చింతకుంట మీదుగా మళ్లించి కరీంనగర్ పట్టణంలోకి అనుమతిస్తారు.
హుజురాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు మానకొండూర్ హైవే మీదుగా దుర్షేడ్ వైపు మళ్లించి కరీంనగర్ పట్టణంలోకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
తేదీ 23-09-2026, 24-09-2026 తేదీల్లో హుజురాబాద్, జగిత్యాల, సిరిసిల్ల వైపుల నుంచి కరీంనగర్ వైపు గ్రానైట్ లారీలు మరియు ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. భారీ వాహనాలు, క్వారీ యజమానులు ఈ ఆంక్షలను గమనించి పోలీసులకు సహకరించాలని సీపీ సూచించారు.
పట్టణంలో ప్రధాన ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు
నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా గాంధీచౌక్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, కమాన్, కేబుల్ బ్రిడ్జి, సదాశివపల్లి జంక్షన్ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ట్రాఫిక్‌ను మళ్లించడంతో పాటు ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని సీపీ గౌష్ ఆలం కోరారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




