Karimnagar: వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 14 Oct 2026 7:09 PM IST
Karimnagar
X

Karimnagar: వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాల నుండి విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చగా ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసిన యాజమాన్యం బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా కళాశాల ట్రెజరర్ శోభా దేవి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలలో భాగంగా బతుకమ్మ వేడుకలను వాగేశ్వరి కళాశాలలో ఘనంగా నిర్వహిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని వాడి పంటలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

బతుకమ్మ విశిష్టతను కొనసాగించేందుకు ప్రత్యేక కళాశాలలో విద్యార్థులు ఫ్యాకల్టీ తో కలిసి వేడుకలను అంగ రంగ వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు రంగురంగు పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకల్లో పాల్గొనగా, వాటిలో ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులను అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రెటరీ డి,శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ గండ్ర శోభాదేవి, డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ప్రిన్సిపాల్ లు శ్రీనివాస్, రామకృష్ణ, హెచ్వోడీలు, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU