Karimnagar: శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మానవ హక్కుల సదస్సు!
Karimnagar: తిమ్మాపూర్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్హెచ్ఆర్సీ సౌజన్యంతో మానవ హక్కులపై అవగాహన సదస్సు జరిగింది. చైర్మన్ ముద్దాసాని రమేష్ రెడ్డి ప్రారంభించారు.
Karimnagar: శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మానవ హక్కుల సదస్సు!
కరీంనగర్: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల లో ఈ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీ సౌజన్యంతో బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హ్యూమన్ రైట్స్ విత్ స్పెషల్ ఫోకస్ అన్ ఉమెన్, చిల్డ్రన్ & వల్ నేరేబుల్ గ్రూప్స్ అనే అంశం పైన జస్టిస్ కుమారయ లా కాలేజ్ కరీంనగర్ నుండి ఇద్దరు న్యాయవాదులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాన్ని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దాసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులైన మీరు భవిష్యత్తులో మంచి ఇంజనీర్లుగా మాత్రమే కాకుండా బాధ్యతగల పౌరులుగా నాయకులుగా ఎదగాలని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత, ఇతరుల పట్ల గౌరవం కూడా అలవర్చుకోవాలని లింగ వివక్ష, మహిళలపై వేధింపులు, సైబర్ వేధింపులు మరియు హింసవంటి సమస్యలను మనం తీవ్రంగా పరిగణించాలని తెలియజేశారు.
ప్రతి విద్యార్థిని సురక్షితంగా గౌరవంగా ఆత్మవిశ్వాసంతో చదువుకునేలా మన కళాశాల వాతావరణము ఉండాలన్నారు. పిల్లలు బలహీన వర్గాల హక్కులను కూడా మనం గుర్తించాలని వారు దోపిడీకి వేధింపులకు నిర్లక్ష్యం కాకుండా వివక్షకు గురికాకుండా రక్షణ పొందాలన్నారు. సమాజంలో తమ సమస్యలను చెప్పుకోలేని వారి తరఫున మనం నిలబడాలని తెలియజేశారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కులను కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కుమారయ లా కాలేజ్ ప్రొఫెసర్ మధ్యల భార్గవ, డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శశికాంత్, ప్రొఫెసర్ డీన్ మహేష్ పర్వాలు, అకాడమిక్ డీన్ డాక్టర్ హరీష్,ఏవో పారువెల్ల రామారావు, మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్, వివిధ డిపార్ట్మెంట్ల విభాగాధిపతులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.




