Karimnagar: తిమ్మాపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి: బీజేపీ డిమాండ్!
Karimnagar: తిమ్మాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై బీజేపీ రాస్తారోకో నిర్వహించింది. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
Karimnagar: తిమ్మాపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి: బీజేపీ డిమాండ్!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల బిజెపి శాఖ అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట రాజీవ్ రహదారి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాస్తారోకో వల్ల రాజీవ్ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకొని బిజెపి నాయకులను కార్యకర్తలతో రాస్తారోకో విరమింప చేశారు. అనంతరం బిజెపి నేతలు మండల తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల ప్రకటనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో తిమ్మాపూర్ మండలం లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరువు మండలాల జాబితాను కేవలం మొక్కుబడిగా మాత్రమే ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల తిరుపతిరెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు గడ్డం అరున్, వేల్పుల ఓదెలు యాదవ్,మా వురపు సంపత్, బూట్ల శ్రీనివాస్,బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.




