Karimnagar: లోక్‌సభ వేదికపై కరీంనగర్ విద్యార్థిని శ్రీనిత్య!

Karimnagar: ఢిల్లీలోని లోక్‌సభలో పాల్గొన్న కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కళాశాల విద్యార్థిని ఎం. శ్రీనిత్యను జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రత్యేకంగా అభినందించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 3 Nov 2026 5:52 PM IST
Karimnagar
X

Karimnagar: లోక్‌సభ వేదికపై కరీంనగర్ విద్యార్థిని శ్రీనిత్య!

కరీంనగర్: కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (A) కు చెందిన బి.ఎస్‌సీ (MStCs) తృతీయ సంవత్సరం విద్యార్థిని ఎం. శ్రీనిత్య అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. భారత మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్ (లోక్‌సభ)లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 రాష్ట్రస్థాయి పోటీలలో తన ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిగా ఎంపిక కావడంతో శ్రీనిత్యకు ఈ అరుదైన అవకాశం లభించింది. దేశ రాజధానిలోని పార్లమెంట్ వేదికపై పాల్గొనడం కళాశాలకు, కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ డా. అశ్విని తానాజీ వాకడే , శ్రీనిత్యను ప్రత్యేకంగా అభినందించి, ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించారు. విద్యార్థులు జాతీయ స్థాయి వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటూ దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు, యువత బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.

శ్రీనిత్య సాధించిన ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ , జిల్లా యువజన అధికారి జి. తిరుపతి రెడ్డి, NSS అడ్వైజరీ కమిటీ చైర్మన్ డా. కె. సురేందర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ పి. నితిన్, టి. రాజయ్య,NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు బి. ఎలిజబెత్ రాణి, డా. కె. అర్జున్, డా. పి. తిరుపతి, ఎం. వెంకటేశ్వర్లు, జి. రాజేందర్ మరియు కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య స్పృహ మరియు జాతీయ సమైక్యతా భావాలను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది. శ్రీనిత్య సాధించిన ఈ ఘనత ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు మాత్రమే కాకుండా యావత్ కరీంనగర్ జిల్లాకు గర్వకారణం. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN