Karimnagar: శ్రీ చైతన్యలో ఘనంగా ఫార్మసీ ఓరియంటేషన్ ప్రోగ్రాం!

Karimnagar: తిమ్మాపూర్ శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఫాం-బి, ఫాం-డి ఓరియంటేషన్. విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యమని చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి వెల్లడి.

ANJANEYULU, MANAKONDURU
Published on: 26 Oct 2026 4:53 PM IST
Karimnagar
X

Karimnagar: శ్రీ చైతన్యలో ఘనంగా ఫార్మసీ ఓరియంటేషన్ ప్రోగ్రాం!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ లోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఫాం బి , ఫాం డి మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం స్వాగతం పలికింది. ఈ సందర్భంగా చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మసీ కోర్సు ప్రాముఖ్యత, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, కళాశాలలో ఉన్న ల్యాబ్ , లైబ్రరీ సౌకర్యాలు, క్రమశిక్షణ నియమాల వివరించారు.

ఫార్మసీ విద్య ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యత అని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. తమ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీచైతన్య విద్యార్థులు చైతన్య వంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం క్లాస్ టాపర్స్ కు మెడల్స్ , సర్టిఫికెట్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరెందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రామ నర్సింహ రెడ్డి, హెచ్ఓడిలు డాక్టర్ రవిందర్ రెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, మిడియా కో ఆర్డినేటర్ గొంటి రమేష్, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU