Karimnagar: సాంకేతిక నైపుణ్యాలతోనే బంగారు భవిష్యత్తు: సాయి చైతన్య రెడ్డి!

Karimnagar: కరీంనగర్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ, సివిల్ ఫ్రెషర్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలని వైస్ చైర్మన్ సాయి చైతన్య రెడ్డి సూచించారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 27 Oct 2026 4:33 PM IST
Karimnagar
X

Karimnagar: సాంకేతిక నైపుణ్యాలతోనే బంగారు భవిష్యత్తు: సాయి చైతన్య రెడ్డి!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల లో ఈరోజు వోల్టు ఫీష్ట -2026 , సివిల్ ఇంజనీరింగ్ సివోర-2026 ఫ్రెషర్స్ పార్టీలను శ్రీ చైతన్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రీ సాయి చైతన్య రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని వృత్తిపట్ల సమగ్ర విజ్ఞానం కలిగి ఉండాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులకు సూచిస్తూ సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు సృజనాత్మక ఆలోచనలు కూడా సమాజాన్ని పరిశ్రమను ముందుకు నడిపే శక్తి హ్యాకతాన్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక ప్రతిభ ఆవిష్కరణ సామర్థ్యం మొదలగు నైపుణ్యాలను పెంపొందించబడుతుందని తెలియజేశారు.

విద్యార్థులందరూ మంచి నైపుణ్యాలను పెంపొందించుకొని వివిధ కంపెనీలలో ఉద్యోగం లభించే విధంగా సాధన చేయాలని తక్కువ జీతం అయినప్పటికిని ఏ కంపెనీ అయినప్పటికీ ఉద్యోగం చేయాలని తద్వారా అనుభవం పొందగలరని తెలియజేశారు.

ప్రస్తుత యుగంలో రోబోటిక్స్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఓటి మొదలగు రంగాలలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా నూతన సాంకేతిక విజ్ఞానం పెంపొందించుకున్నట్లయితే కంపెనీ ఉద్యోగ నియామకాలలో ప్రాముఖ్యత ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. శశికాంత్, ఈసీఈ హెచ్.ఓ.డి డాక్టర్ నరేష్ కుమార్, సివిల్ ఇంజనీరింగ్ హెచ్.ఓ.డి శ్రీరామ్ చందు, పాలనాధికారి పారువెల్ల రామారావు,మీడియా ఇంచార్జ్ గొంటి రమేష్, విద్యార్థులతో పాటు అధ్యాపకులు, ఇతర డిపార్ట్మెంట్ల విభాగాధిపతులు తదితరులు ఉన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU