Karimnagar: అక్రమ మట్టి తవ్వకాలు, చెట్ల తొలగింపుపై క్రిమినల్ కేసులు పెట్టాలి

Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్రమ మట్టి తవ్వకాలు, చెట్లను తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 12 Nov 2026 5:41 PM IST
Karimnagar
X

Karimnagar: అక్రమ మట్టి తవ్వకాలు, చెట్ల తొలగింపుపై క్రిమినల్ కేసులు పెట్టాలి

కరీంనగర్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను తొలగించడానికి మరియు మట్టి తవ్వకాలను చేయడాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ బృందం సందర్శించి యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్రమంగా తవ్వకాలు మరియు చెట్లను కొట్టివేయడం పూర్తిగా పర్యావరణాన్ని విచ్చిన్నం చేసే కుట్రగా కనబడుతుంది. ప్రకృతికి నిలియంగా ఉన్న విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు ఆహ్లాదకరంగా వాతావరణ ఉంటుంది అలాంటి ప్రదేశంలో అక్రమంగా చెట్లు తొలగించడానికి మరియు అక్రమ మట్టి తవ్వకాలు చేయడానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది దీనికి కారకులైన వారిపై తక్షణమే యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతుంది.

అక్రమ తవ్వకాలు దసరా సెలవుల ముందు నుండే జరుగుతుంది దీనిపైన యూనివర్సిటీ అధికారులకు కనబడలేదని వారు ప్రశ్నించారు. ఒక్కరోజు అయినా పని కాదు ఇది గత కొన్ని రోజులుగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి దీనిపైన వైస్ ఛాన్స్లర్ ఉమేష్ కుమార్ గారిని ప్రశ్నిస్తే ఆయన సమాధానంగా సింథటిక్ ట్రాక్ కొరకు తవ్వకాల్లో కేవలం కొత్త బాగా మాత్రమే మట్టిని స్వీకరించామని ఆయన తెలియజేస్తున్నారు కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ దానిని దుర్వినియోగ చేస్తూ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాల్లో ప్రోత్సహించినట్టు స్పష్టంగా కనబడుతుంది కావున ఈ చర్యలకు కారకులైన ఎంతటి వారినైనా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

యూనివర్సిటీ మన అందరి బాధ్యత దానిని రక్షించుకోవాల్సిన అవసరం మనందరికి ఉందని ప్రకృతి కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత దానిని విధ్వంసం చేసే ప్రక్రియ యూనివర్సిటీ అధికారులు సిబ్బంది చేపడితే కచ్చితంగా విద్యార్థులు ఏకం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది . ప్రకృతి కాపాడుకోవడం కోసం విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున సిద్ధమవుతామని సందర్భంగా వారు హెచ్చరించారు.

కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వినయ్ సాగర్ నాయకులు హరీష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR