Karimnagar: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఎస్బీటెట్ సెక్రటరీ పుల్లయ్య

Karimnagar: వాగేశ్వరీ విద్యాసంస్థల గ్రాడ్యుయేషన్ డేకి హాజరైన ఎస్బీటెట్ సెక్రటరీ పుల్లయ్య. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం.

ANJANEYULU, MANAKONDURU
Published on: 31 Oct 2026 7:22 PM IST
Karimnagar
X

Karimnagar: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఎస్బీటెట్ సెక్రటరీ పుల్లయ్య

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్, ఫార్మసీ, పీజీ కళాశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని వాగేశ్వరీ విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ గండ్ర శ్రీనివాస రెడ్డి, జగిత్యాల జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపల్ జి నరసింహ తో కలసి జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ... ప్రపంచ దేశాలు మన దేశం వైపు, తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు.

తెలంగాణాలో మంచి విద్య అందుతుందని, యువత ఎక్కువగా ఉందని వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. మన దేశ ప్రతిష్టలు యువత చేతిలోనే ఉన్నాయని అన్నారు. విద్యార్థులు ఇన్నోవేషన్, క్రియేషన్స్, రీసెర్చ్ వైపు దృష్టి సారించాలని సూచించారు.

ఒక ఐడియా ప్రపంచ స్థితి గతులను మార్చుతుందనే విషయాన్ని గమనించాలని తెలిపు. ప్రతీ ఒక్కరూ భవిష్యత్తులో ఏమీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని, కేవలం వ్యక్తిగత అభివృద్ది కాకుండా మనం బాధ్యతగా దేశానికి, సమాజానికి గుర్తింపు వచ్చేలా సేవలు అందించాలన్నారు. విద్యార్థులు క్లాస్ లతో కలిపి సుమారు 16 గంటల పాటు చదవాలని, ఫ్యాకల్టీ సుమారు 8 గంటల పాటు పని చేయాలని, విద్యార్థులతో కలిసి ఉండాలని సూచించారు.

విద్యార్థులు సమయపాలన పాటింటాలని, ఆటలకు ప్రాధాణ్యతనిస్తే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అలాగే మంచి లీడర్ గా ఎదికి సమాజానికి సేవ చేయాలన్నారు. అనంతరం డిగ్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేసి, పట్టదారులకు పట్టాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ ద్యావ శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ శోభాదేవి, డైరెక్టర్లు ప్రకాశ్ రెడ్డి, విశ్వనాథ్ వినోద్, ప్రిన్సిపాళ్ళు శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీనివాస రెడ్డి, ఫ్యాకల్టీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU