Karimnagar: శాతవాహన వర్సిటీ ఫుట్‌బాల్, టేక్వాండో జట్ల ఎంపికలు
Karimnagar: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో శాతవాహన విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల ఫుట్‌బాల్, టేక్వాండో జట్ల ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించారు.
Karimnagar: శాతవాహన వర్సిటీ ఫుట్‌బాల్, టేక్వాండో జట్ల ఎంపికలు
కరీంనగర్: కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో శాతవాహన విశ్వవిద్యాలయ అంతర్‌కళాశాలల ఫుట్‌బాల్ మరియు ఆల్ ఇండియా టేక్వాండో జట్టు ఎంపికల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాతవాహన విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ నజిముద్దీన్ మున్వర్ ఎంపికలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు మానసిక దృఢత్వాన్ని, క్రమశిక్షణను, సమష్టితత్వాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు ఉత్సాహంతో పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి శాతవాహన విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ ఎంపిక పోటీలలో వివిధ కళాశాలల క్రీడాకారులు పాల్గొనగా, విశ్వవిద్యాలయ పీడీ విజయకుమార్, వ్యాయామ అధికారులు శ్రీధర్ రావు, దినేష్, ప్రవీణ్ కుమార్, రషీద్,సంపత్, క్రీడా నిర్వాహకులు ప్రతిభావంతులైన క్రీడాకారులను విశ్వవిద్యాలయ జట్ల కోసం ఎంపిక చేశారు.




