Karimnagar: హిమాచల్ ప్రదేశ్‌కు శాతవాహన వర్శిటీ అడ్వెంచర్ క్యాంపు టీం

Karimnagar: శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగే జాతీయ అడ్వెంచర్ క్యాంపునకు విద్యార్థుల బృందం బయలుదేరింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 16 Nov 2026 7:05 PM IST
Karimnagar
X

Karimnagar: హిమాచల్ ప్రదేశ్‌కు శాతవాహన వర్శిటీ అడ్వెంచర్ క్యాంపు టీం

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపులో పాల్గొనేందుకు డా. కాంపెల్లి అర్జున్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు బయలుదేరింది. నవంబర్ 18 నుంచి 27 వరకు పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ నేషనల్ అడ్వెంచర్ క్యాంపులో విశ్వవిద్యాలయ బృందం పాల్గొననుంది.

ఈ సందర్భంగా బృందానికి శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపులో పాల్గొనడం విద్యార్థులకు మంచి అవకాశమని, ఈ అనుభవం వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తుందని ఆకాంక్షించారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ జాతీయ సేవా పథకం సమన్వయ అధికారి డా. ఈ. మనోహర్ వివిధ ప్రోగ్రాం అధికారులు జాతీయ స్థాయి వేదికపై శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తూ అడ్వెంచర్ క్యాంపులో పాల్గొంటున్న బృందం విశ్వవిద్యాలయానికి, కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని పలువురు అధ్యాపకులు కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR