Karimnagar: శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నా

Karimnagar: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల శాంతియుత ధర్నా; క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 25 Nov 2026 7:06 PM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నా

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ పిలుపుమేరకు, ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ విశ్వవిద్యాలయ ఆవరణలో శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో ఏళ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళన చేపట్టినట్లు అధ్యాపక సంఘం తెలిపారు. విశ్వవిద్యాలయాల విద్యాప్రమాణాల పెంపులో కీలక పాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం విస్మరించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాన డిమాండ్లుఐన 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ ప్రభుత్వం తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గౌరవప్రదమైన 'సమాన పనికి సమాన వేతనం' విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో కూడిన మినిమం టైం స్కేల్ కల్పించాలని నినాదాలు చేసారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపక బాధ్యులు డా. మనోజ్ కుమార్, డా. రమేష్ రెడ్డి, డా. తిరుపతి, డా. రాజు, డా. అజయ్, డా. జోసెఫ్, డా. ప్రసాద్, డా. రవికుమార్ పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR