Karimnagar: సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం రూ. 3 కోట్ల నిధులు కేటాయింపు
Karimnagar: కరీంనగర్లో సద్దుల బతుకమ్మకు రూ.3 కోట్లతో బల్దియా ఏర్పాట్లు చేసింది. కొత్తపల్లి, గార్లకుంట నిమజ్జన కేంద్రాలను మేయర్ శ్రీనివాస్ పరిశీలించారు.
Karimnagar: సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం రూ. 3 కోట్ల నిధులు కేటాయింపు
Karimnagar: తెలంగాణ సంస్కృతిని చాటే... సద్దుల బతుకమ్మను నగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపు నిచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా జరుగబోయే సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్దం చేశామని తెలిపారు. కరీంనగర్ లో శనివారం పలువురు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి కొత్తపల్లి, గార్లకుంట నిమజ్జనం ఘాట్లను సందర్శించి... ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు. నగరపాలక సంస్థ రూ: 3 కోట్ల నిధులను కేటాయించి మొత్తం 28 పాయింట్లలో భారీ ఏర్పాట్లతో పటిష్టమైన వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నగరపాలక సంస్థ ద్వారా సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 28 పాయింట్లను ఏర్పాటు చేసి కావల్సిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పాయింట్ వద్ద నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించామని...
సద్దుల బతుకమ్మ వేడుకలో ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పాయింట్ వద్ద భారికేడింగ్ తో పాటు గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే భక్తుల కోసం తాగునీటి వసతి, చక్కటి లైటింగ్, సౌండ్ సిస్టమ్, ప్రతి ప్రదేశంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేయడం జరుగుతుందని తెలిపారు.
నగర ప్రజలందరూ సద్దుల బతుకమ్మను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నగర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పోరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




