Karimnagar: నకిలీ నంబర్లతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు: పోలీసులు!

Karimnagar: కరీంనగర్ రూరల్ పరిధిలోని నగునూరు ఎక్స్‌రోడ్డు వద్ద నకిలీ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 16 Oct 2026 9:37 PM IST
Karimnagar
X

Karimnagar: నకిలీ నంబర్లతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు: పోలీసులు!

కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగునూరు ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో ప్రయాణిస్తున్న ఒక టీవీఎస్ స్టార్ సిటీ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

కరీంనగర్ రూరల్ ఏ. నిరంజన్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఎ. లక్ష్మారెడ్డి తన సిబ్బంది మహమ్మద్ ఎస్‌కే ఫైజాన్, పీసీ 3830, కె. సాగర్, పీసీ 3909, బి. రమేష్, పీసీ 3845లతో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో AP15R3355 నంబర్‌తో ఉన్న టీవీఎస్ స్టార్ సిటీ ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఆ నంబర్ వేరే వాహనానికి చెందినదిగా గుర్తించారు.

విచారణలో ఆ వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్ AP 15 TR 3355 అని, నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తి నగునూరు గ్రామానికి చెందిన భూత్కూరి కరుణాకర్ అని వెల్లడైందని తెలిపారు.

సదరు వ్యక్తి 15-02-2011న జగిత్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిర్వహించిన వేలంలో ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. అయితే వాహన యాజమాన్య బదిలీని పూర్తి చేయకుండా, తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, మరో వాహనానికి చెందిన నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.వాహనం యొక్క అసలు గుర్తింపును దాచిపెట్టి, అధికారులను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించి, సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుముల నిరంజన్ రెడ్డి, మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన సరైన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లనే ఉపయోగించాలని సూచించారు. ఇతర వాహనాలకు చెందిన నంబర్లను అక్రమంగా ఉపయోగించడం, నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలు నడపడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN