Karimnagar: కరీంనగర్: ముగ్ధంపూర్ వద్ద కారు ఢీకొని మహిళ మృతి
Karimnagar: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్ధంపూర్ SH-1 రహదారిపై అతివేగంగా వచ్చిన బ్రీజా కారు ఢీకొని దాడి శారద (50) అనే మహిళ మృతి చెందింది.
Karimnagar: కరీంనగర్: ముగ్ధంపూర్ వద్ద కారు ఢీకొని మహిళ మృతి
కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్ధంపూర్ SH-1 ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగి మహిళా మృతి చెందింది. పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 20-09-2026 ఉదయం సుమారు 11:20 గంటల సమయంలో ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన దాడి శారద వయసు 50 సం,లు మరియు కూకట్ల కనుకమ్మ అనువారు రోడ్డు పక్కన నిల్చొని ఉండగా గోదావరికనీ వైపు నుండి వచ్చిన బ్రీజా కారు డ్రైవర్ అతివేగంగా జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఇద్దరిని ఢీకొట్టగా వారికి తీవ్ర గాయాలు అయినాయి.
వెంటనే వారిని చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించగా దాడి శారద చికిత్స పొందుతూ మరణించినది, మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆన్ సైట్ ఎఫ్. ఐ.ఆర్ నమోదు చేసి మృతురాలి శవానికి శివపంచనమః నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినారు, ఇట్టి ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఫిర్యాదు స్వీకరించిన కరీంనగర్ రూరల్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి, ప్రమాదానికి గల కారణాలు, సంబంధిత వాహనాల వివరాలు మరియు బాధ్యుల గురించి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపినారు.




