Karimnagar: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్!

Karimnagar: కరీంనగర్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహణ. ఎస్సార్ఆర్ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 4 Oct 2026 6:02 PM IST
Karimnagar
X

Karimnagar: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అత్యంత ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ​ఈ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలింగ్ కేంద్రానికి స్వయంగా విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సమాజంలో రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లే నూతన పాలకవర్గ ఎంపిక కోసం జరుగుతున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ​ఈ పోలింగ్ ప్రక్రియలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, రెడ్‌క్రాస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును చాటుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN