Karimnagar: ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: కలెక్టర్!
Karimnagar: కరీంనగర్ ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
Karimnagar: ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: కలెక్టర్!
కరీంనగర్: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి,అధికారులతో కలిసి ప్రజల నుంచి 44 అర్జీలు స్వీకరించారు. అత్యధికంగా కరీంనగర్ నగరపాలికకు 19 దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం కల్లా శాఖల లాగిన్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.వచ్చే సోమవారం నుంచి మొదటి గంటలో పెండింగ్ దరఖాస్తులను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని.. ఈ లోగా అధికారులు లాగిన్ లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేయాలని సూచించారు. కలెక్టరేట్ సూపరింటెoడెంట్లు కాళీ చరణ్, మాధవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




